కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రెండో ఏడాది కూడా ఇంటర్ పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం… మొదట్లో ఫస్టియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తాజాగా అధికారులతో సమీక్ష నిర్వహించిన సెకండియర్ ఫలితాలను సైతం రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇక, ఏ ప్రతిపాదికన విద్యార్థులను పాస్ చేయాలన్న దానిపై ఇంటర్ బోర్డు కసరత్తు పూర్తి చేసింది.. వారం రోజుల్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నట్టు తెలిపారు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్.. ఏ విధంగా రిజల్ట్స్ ప్రకటించాలనే క్రైటీరియాను సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామన్న ఆయన.. వారం రోజుల్లో ఫలితాలు వస్తాయనివెల్లడించారు..
ఇక, జులై 1వ తేదీ నుండి సెకండ్ ఇయర్ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని.. జులై 15 నుండి మొదటి సంవత్సరం ఆన్‌లైన్ తరగతులు స్టార్ అవుతాయని… ఈ సారి ఆఫ్ లైన్, ఆన్‌లైన్‌లో ఇంటర్ తరగతులు ఉంటాయన్నారు ఉమర్ జలీల్.. ఈ సారి కూడా 70 శాతం సిలబస్ మాత్రమే ఉంటుందన్న ఆయన.. లెక్చరర్ లు, సిబ్బంది వంద శాతం కళాశాలలకి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు.. మరోవైపు.. ప్రైవేట్ జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు దరఖాస్తు గడువు పొడిగించామన్న ఆయన.. ఆఫలియేషన్ ఫీజ్ ను తగ్గించాము.. గతంలో ఉన్న ఫీజులు కళాశాలలు చెల్లిస్తే సరిపోతుందన్నారు.. ఇక, ఆన్‌లైన్ తరగతులపై టీ శాట్, దూరదర్శన్ తో ఇంకా ఒప్పందం చేసుకోవాల్సి ఉందన్నారు ఉమర్ జలీల్.