INS Satpura, Indian Warship's Historic US Visit: భారత యుద్దనౌక ఐఎన్ఎస్ సాత్పురా అమెరికా పర్యటనలో చరిత్ర సృష్టించింది. ఓ భారత యుద్ధ నౌక అమెరికా పశ్చిమ తీరాన్ని చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ రికార్డును ఐఎన్ఎస్ సాత్పురా సొంతం చేసుకుంది. ఇండియాకు స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఐఎన్ఎస్ సాత్పురా ఈ చారిత్రాత్మక పర్యటన చేస్తోంది. అమెరికా పశ్చిమ తీరం కాలిఫోర్నియా లోని శాన్ డియాగోకు చేరుకుంది.