జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన కేసులో ఊహించని పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుల్ని అరెస్ట్ చేస్తోన్న పోలీసులు.. సాక్ష్యాలను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఈ కేసులో కీలకంగా మారిన ఇన్నోవా, బెంజ్ కార్లని స్వాధీనం చేసుకున్నారు. అయితే, తాజాగా అందరూ విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నోవా కారుని పరిశీలించిన పోలీసులకు.. ఆ కారుని నిందితులు సర్వీసింగ్ చేయించినట్టు తెలిసింది. అందులో ఉన్న సాక్ష్యాలేవీ దొరక్కుండా ఉండేందుకు నిందితులు తెలివిగా…