Today (14-01-23) Business Headlines: ఫారెక్స్ తగ్గింది.. పసిడి పెరిగింది: ఇండియాలోని విదేశీ మారక నిల్వలు మరోసారి తగ్గాయి. తాజాగా 126 కోట్ల డాలర్లకు పైగా క్షీణించాయి. ఫలితంగా 56 వేల 158 కోట్ల డాలర్లకు చేరాయి. రూపాయి విలువను రక్షించేందకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెక్స్ రిజర్వులను వెచ్చిస్తుండటంతో అవి నేల చూపులు చూస్తున్నాయి. ఇది ఈ నెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారం.