విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై 2025 దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ‘మూలా నక్షత్రం’ రోజు కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి అర్ధ రాత్రి నుంచే భక్తులను అనుమతించారు. దీంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. అమ్మవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వినాయక గుడి నుంచి సుమారు 3 కిమీ మేర భక్తులు బారులు తీరారు. ఉదయం 9:30 గంటలకు లక్ష…