UPSC Aspirant Suicide: ‘‘ఎవరూ ఐఏఎస్ ఊరికే అవరు. ఇప్పుడే మీరు నిద్ర నుంచి మేల్కొని చదవాలి’’ అంటూ గది గోడలపై ఎన్నో ఇలాంటి మోటివేషనల్ కోట్స్ ఉన్నాయి. అయినా కూడా, పదే పదే వైఫల్యాల కారణంగా, ఒత్తిడిని ఎదుర్కోలేక ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్‌కి చెందిన ఆశా ఉయ్కే(25) తన జీవితాన్ని ముగించింది.