Indore: 8 ఏళ్లుగా తనతో శృంగారానికి నిరాకరిస్తుందనే కోపంతో ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 40 ఏళ్ల మహిళ జనవరి 9న ఏరో డ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరణించిందని డీసీపీ శ్రీకృష్ణ లాల్‌చందానీ మీడియాకు తెలిపారు.