Indo American: కొడుక్కి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్న కోడలిపై కక్ష పెంచుకున్నాడు మామ. అమెరికాలోని కాలిఫోర్నియా మాల్ పార్కింగ్ లాట్‌లో కోడల్ని చంపిన కేసులో భారత సంతతికి చెందిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. శాంజోస్‌లో సెప్టెంబరు 30న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గురుప్రీత్ కౌర్ దోసాంజ్ శాంజోస్ వాల్‌మార్ట్‌లో పనిచేస్తుండగా.. 150 మైళ్ల దూరంలో ఉన్న తన కోడల్ని వెదుక్కుంటూ వచ్చిన ఆ వ్యక్తి తుపాకితో కాల్చి చంపినట్టు తెలుస్తోంది.…