Today Stock Market update 01-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి మార్చిలో శుభారంభం లభించింది. ఈ నెలలో మొదటి రోజైన ఇవాళ బుధవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలోనూ ప్రాఫిట్స్ కొనసాగాయి. దీంతో సాయంత్రం సైతం లాభాలతో ముగిశాయి. ఫలితంగా.. వరుసగా 8 రోజుల నుంచి వస్తున్న నష్టాలకు ఎట్టకేలకు బ్రేక్ పడటం వల్ల ఇన్వెస్టర్లు హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.