రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో ప్రసిద్ధ ఆడపులి "ఆరోహెడ్" మరణించింది. ఆరోహెడ్ వయసు దాదాపు 11 సంవత్సరాలు. ఇది ఫిబ్రవరి 2014లో జన్మించిందని అధికారులు తెలిపారు. ఆరోహెడ్, రణథంబోర్ పార్క్‌లోని ప్రసిద్ధ ఆడపులి 'మచ్లి' కుటుంబానికి చెందినది. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆరోహెడ్ బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించింది.
Google Doodle: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక ‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్‘ (Wildlife Meets Culture) డూడిల్‌ను రూపొందించింది. ఈ డూడిల్ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రాంతాల భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. ఈ రంగురంగుల కళాఖండాన్ని పుణేకు చెందిన కళాకారుడు రోహన్ దహోత్రే చిత్రీకరించారు. ఈ డూడిల్‌లో లడాఖ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న మంచు చిరుత, ధోతీ-కుర్తా ధరించిన ‘పులి’తో పాటు, పావురం, నీలగిరి తహర్…