టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ తన కుమారుల్లో ఒకరికి ఇండియన్ సైంటిస్ట్ పేరు పెట్టారు. తన కొడుకు పేరులో భారతీయ శాస్ర్తవేత్త ‘చంద్రశేఖర్’ను చేర్చారట. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ 2023లో వెల్లడించారు. కెనడాకు చెందిన శివోన్ అలీసా జిలిస్‌తో కలిగిన కవలల్లోని ఒక కుమారుడి మధ్య పేరు ‘చంద్రశేఖర్’గా పెట్టినట్లు ఎలాన్ మస్క్ తనతో చెప్పినట్లు రాజీవ్ వెల్లడించారు.