Senior Citizen Railway Concession: 2026 ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానుంది. ఈ బడ్జెట్ లో సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్ ఛార్జీలలో భారీ రిలీఫ్ లభించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. శతాబ్ది, రాజధాని, మెయిల్/ఎక్స్‌ప్రెస్ లాంటి ప్రధాన రైళ్లలో సీనియర్ సిటిజన్లకు 40 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీలను పునరుద్ధరించాలని కేంద్రం పరిశీలిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.