ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నివాసి రాజ్‌కుమార్ మిశ్రా దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారు. ఆయన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడి మేయర్ ఎన్నికల్లో గెలిచారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రాజ్ కుమార్ లండన్ లోని వెల్లింగ్ బరో నగర మేయర్ గా ఎన్నికయ్యారు. దీంతో ఆయన స్వగ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.