Operation Sindoor: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో భీకరదాడులు చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలతో పాటు ఆ దేశ ఎయిర్ ఫోర్స్ బేసుల్ని ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే, దయాది దేశం మళ్లీ తోక జాడిస్తే మళ్లీ దాడులు చేస్తామని ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు సైన్యాధికారులు వార్నింగ్ ఇచ్చారు.