Lanza-N 3D-Radar: టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), స్పానిష్ రక్షణ సంస్థ ఇంద్రాతో కలిసి భారత నావికాదళం కోసం మొట్టమొదటి 3D ఎయిర్ సర్వైలెన్స్ రాడార్ (3D-ASR) - లాంజా-N ను ప్రారంభించింది. ఈ రాడార్‌ను భారత నావికాదళ యుద్ధనౌకలో ఏర్పాటు చేశారు. ఇది రక్షణాయుధాల ఉత్పత్తిరంగంలో మన దేశం సాధించిన తొలి అడుగు. ఇక మన పొరుగున ఉన్న శత్రుదేశాలు పాకిస్థాన్, చైనాలకు ఇది ఓ చేదు వార్తల మిగిలిపోతుంది.