అగరబత్తుల తయారీపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అగరబత్తుల తయారీలో ఉపయోగించే కొన్ని హానికరమైన క్రిమిసంహారక రసాయనాలను పూర్తిగా నిషేధిస్తూ చర్యలు చేపట్టింది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని అగరబత్తుల తయారీకి సంబంధించిన కొత్త నాణ్యత ప్రమాణాలను విడుదల చేసింది. అయితే..ఈ ప్రమాణాల ప్రకారం మానవ ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. దీని వల్ల ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన అగరబత్తులు అందుబాటులోకి రానుండగా, ఆరోగ్యపరమైన ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం…