Nimisha priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్ దేశంలో ఉరికంబానికి దగ్గర అవుతున్నారు. ఆ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు.
యెమెన్ జాతీయుడి హత్య కేసులో ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు వచ్చే వారం జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. గత సంవత్సరం, కేరళకు చెందిన నిమిషా ప్రియకు యెమెన్ అధ్యక్షుడు మరణశిక్షను ఆమోదించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఆమె కుటుంబ సభ్యులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఉరిశిక్ష పడిన…