Canada: కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాడులు బరితెగిస్తున్నారు. భారత్ రాయబార కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన ‘‘సిఖ్ ఫర్ జస్టిస్(SFJ)’’ వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడిస్తామని బెదిరింపులకు పాల్పడింది. భారత కాన్సులేట్‌ను గురువారం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. ఇండో కెనడియన్లు తమ సాధారణ పనుల కోసం కాన్సులేట్‌కు వచ్చే వారు వేరే తేదీని ఎంచుకోవాలని కోరింది.