Bangladesh Lynching: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వరసగా మైనారిటీలను ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ రాడికల్ ఇస్లామిస్ట్‌లు హత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల, బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనే 25 ఏళ్ల హిందూ వ్యక్తిని ‘‘దైవ దూషణ’’ ఆరోపణలపై మతోన్మాదులు కొట్టి చంపారు. శరీరాన్ని నగ్నంగా రోడ్డ పక్కన చెట్టుకు వేలాడదీసి, అంతా చూస్తుండగా నిప్పటించి చంపారు. ఈ ఘటన తర్వాత, పోలీస్ విచారణలో, దీపు దైవదూషణ చేసినట్లు…