దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇండియాలో కొనసాగుతోంది. అయితే, వ్యాక్సిన్ కోసం అనేకమంది భారతీయులు నేపాల్ బాటపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు, అనేకమంది భారతీయులు చైనాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. చైనాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అలానే చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో చదువుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు . ఎవరైనా సరే చైనాలో అడుగుపెట్టాలి అంటే చైనా వ్యాక్సిన్…
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. ఇందులో 1,26,71,220 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,79,740 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1341 మంది మృతి చెందారు. …
దేశంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్ లో పెద్ద వయసుకలిగిన వ్యక్తులకు కరోనా సోకగా, సెకండ్ వేవ్ లో ఎక్కువమంది యువత కరోనా బారిన పడుతున్నారు. పార్టీలు, ఫంక్షన్లు, వేడుకలు, పబ్లిక్ ప్లేస్ లు కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. ఎక్కువ మంది ఒక చోట గుమికూడి ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో కంటే కరోనా నగరాల్లో అధికంగా విస్తరిస్తోంది. 2టైర్, 3 టైర్ నగరాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన…
చూస్తుండగానే కోవిడ్ 19 సెకండ్ వేవ్ అదుపు తప్పిపోవడం ఆందోళనకరంగా మారింది, రోజుకు రెండు లక్షల కేసులకు మించి నమోదవడం మొదటి దఫా పరిస్తితిని మించిపోయింది.కేసులు ఎక్కువగా వున్నా మరణాలు ఆ స్తాయిలో లేవని మొదట అనుకున్నారు గాని ఆ సంతోషం కూడా ఆవిరైపోయింది. మొదటి దఫాలో మరణాల రేటు 1.1 శాతం లోపే ఉండగా ఇప్పుడు 1.3 శాతం దాటిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. పైగా పెరుగుదల వేగం కూడా గతం కంటే చాలా ఎక్కువగా వుంది.గతంలో…
ఇండియాలో విజృంభణ దారుణంగా ఉంది. రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో రోజువారీ కేసుల్లో ఇండియా టాప్ లిస్ట్ లో ఉన్నది. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది. సెకండ్ వేవ్ లో కేసులు విజృంభిస్తుండటంతో కేంద్రం కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నది. ఇక ఇదిలా ఉంటె తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్ మరో ముందడుగు వేసింది. ఇప్పటి వరకు రెండు రకాల వ్యాక్సిన్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు కూడా ఇండియా అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఇండియాలో మరో వ్యాక్సిన్ కూడా రెడీ అయ్యింది. అయితే, ఇది అలోపతి కాదు, హోమియోపతి వ్యాక్సిన్. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా ఇండియాలో హోమియోపతి వ్యాక్సిన్ తయారు చేసినట్టు లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్…
ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈరోజు ఎప్పుడు లేనంతంగా కేసులు నమోదయ్యాయి. కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,00,739 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,74,564కి చేరింది. ఇందులో 1,24,29,564 మంది దేశంలో కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,71,877 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 93,528 మంది కోలుకొని…
ఇండియాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతుండగా ఈరోజు ఏకంగా రెండు లక్షలకు చేరువలో కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో 1,85,190 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,73,825 కి చేరింది. ఇందులో 1,23,36,036 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనాతో 24 గంటల్లో 1026 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి…
భారత్లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది.. రెండవ విడతలో రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. మరోసారి లక్షదాటాయి రోజువారి కేసుల సంఖ్య… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటలలో 1,68,912 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… ఇదే సమయంలో 904 మంది కన్నుమూశారు.. ఇక, 75,086 మంది కోలుకున్నారు.. దీంతో.. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,27,717కు చేరుకోగా… కోలుకున్నవారి సంఖ్య 1,21,56,529కు…
నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశారు. నెలల రోజుల వ్యవధిలోనే ప్రజలపై వందల రూపాయల భారాన్ని మోపారు. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇక, సిలిండర్ బుక్ చేసుకున్న వ్యక్తి ఈ మొత్తం చెల్లిస్తే సబ్సిడీ సొమ్ము తిరిగి బ్యాంకు ఖాతాలో పడేది. కానీ, ప్రస్తుతం సబ్సిడీ నగదు కూడా జమ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.…