పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. యూఎన్ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. ఇక ట్రంప్ ఆహ్వానం మేరకు గురువారం వైట్‌హౌస్‌కు వెళ్లనున్నారు. ట్రంప్‌తో షెహబాజ్ షరీఫ్‌తో పాటు అసిమ్ మునీర్ కూడా హాజరు కావడంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.