India Wanted Pilots: విమానయాన రంగం అభివృద్ధి దిశగా రెక్కలు తొడిగి రెప రెప లాడుతుండటంతో ఇండియాకి ఏటా వెయ్యి మందికి పైగా పైలట్లు అవసరమనే అంచనాలు వెలువడుతున్నాయి. వచ్చే ఐదేళ్లపాటు పైలట్లకు ఇదే స్థాయిలో డిమాండ్ నెలకొంటుందని చెబుతున్నారు. అయితే మన దేశానికి అవసరమైన సంఖ్యలో పైలట్లకు శిక్షణ ఇవ్వటానికి సరిపోను మౌలిక వసతులు లేవని నిపుణులు అంటున్నారు.