ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా.. రెండో మ్యాచ్ అయితే ఉత్కంఠభరితంగా సాగింది. చివరి వరకూ ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఫైరల్‌గా భారత్ 4 పరుగుల తేడాతో రికార్డ్ విజయం నమోదు చేసింది. ఇదే సమయంలో ఓ చెత్త రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్ అవ్వడమే ఆ చెత్త రికార్డ్. దినేశ్ కార్తీక్, అక్షర్…
ఆగండి.. ఆగండి.. తొందరపడకండి! రోహిత్ శర్మను టీ20 జట్టు కెప్టెన్‌గా తొలగించడం లేదు. కాకపోతే.. అతడు లేనప్పుడు ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలా? అనే విషయంపైనే ఇప్పుడు జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ రిషభ్ పంత్‌కి దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే! అప్పుడు అతని కెప్టెన్సీపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. మొదట్లో రెండు మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు, పంత్‌ని తప్పించాల్సిందేనంటూ తారాస్థాయిలో విజ్ఞప్తులు వచ్చాయి. ఆ తర్వాత మరో రెండు మ్యాచెస్‌లో టీమిండియా…
డబ్లిన్ వేదికగా జరుగుతున్న భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం సృష్టించాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈరోజు తొలి టీ20, మంగళవారం రెండో టీ20 జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు హార్డిక్ పాండ్యా నేతృత్వం వహిస్తున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్…
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోన్న భారత్.. ఇది ముగిసిన వెంటనే ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఆ సిరీస్‌కు భారత జట్టుని ప్రకటించింది. ఆ జట్టుకి హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గానూ, భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గానూ నియమించింది. ప్రెజెంట్ దక్షిణాఫ్రికాతో తలపడుతున్న భారత్‌కి నాయకత్వ బాధ్యతలు చేపడుతోన్న రిషభ్ పంత్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ జట్టులో సంజూ శాంసన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్‌కు చోటు…