భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సూపర్ విక్టరీ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా రాణించి, భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని (378) సునాయాసంగా చేధించింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ ఒక సరికొత్త రికార్డ్‌ని సృష్టించింది. టెస్టుల్లో భారత్‌పై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా చరిత్రపుటలకెక్కింది. తొలుత 1977లో పెర్త్ వేదికగా భారత్ నిర్దేశించిన 339 పరుగుల టార్గెట్‌ని ఆస్ట్రేలియా చేధించింది. ఇప్పటివరకూ…