India-UK trade deal: భారత్, యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)ల మధ్య అతిపెద్ద ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA)’’ కుదిరింది. గురువారం మైలురాయిగా నిలిచే ఈ ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోడీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పియూష్ గోయల్, జొనాథన్ రేనాల్డ్స్ సంతకాలు చేశారు. 2020లో యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి యూకే నిష్క్రమించిన తర్వాత, ఆ దేశం చేసిన అతిపెద్ద ఒప్పందం ఇదే. లండన్‌లో మోడీ, స్టార్మర్ మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత…