IND vs SA 2nd Test: గువాహటిలో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్‌కు ఈ మ్యాచ్ సిరీస్ భవితవ్యాన్ని నిర్ణయించేదిగా మారింది. తొలిసారిగా టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న బర్సాపారా స్టేడియంలోని పిచ్ స్వభావంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎర్రమట్టితో రూపొందించిన ఈ పిచ్ ప్రస్తుతం పచ్చికతో ఉన్నప్పటికీ, మ్యాచ్‌కు ముందునే దానిని కత్తిరించే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా ఎర్రమట్టి…