స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేసింది. ఏడేళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెబుతున్నట్లు తెలిపింది. తన దీర్ఘకాల భాగస్వామి పారుపల్లి కశ్యప్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. సైనా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక ప్రకటన విడుదల చేసి ఈ విషయాన్ని తెలియజేసింది. సైనా, పారుపల్లి 7 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందారు. కలిసి ఈ క్రీడలో పురోగతి సాధించారు. ఇద్దరూ…