దిత్వా తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తుఫాను ఆదివారం తెల్లవారుజామున ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.