హాకీ ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. భారత్ నాలుగోసారి ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఖండాంతర టోర్నమెంట్‌ను గెలుచుకోవడంతో భారత జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. రాజ్‌గిర్‌లో జరిగిన ఫైనల్‌లో సుఖ్‌జీత్, దిల్‌ప్రీత్, అమిత్ భారత్ తరఫున గోల్స్ సాధించారు.