Finland: ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. రష్యా, చైనాల నుంచి భారత్‌ను వేరే చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ‘‘సూపర్ పవర్’’గా కొనియాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు, శాంతి చర్చల్లో భారత పాత్రను నొక్కి చెప్పారు. సాంకేతికత-వాణిజ్యంలో సహకారం ద్వారా భారత్-ఫిన్లాండ్ సంబంధాలు బలోపేతం అవుతాయని అన్నారు.
S Jaishankar: యూరోపియన్ యూనియన్ నేతలతో చర్చల కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బ్రస్సెల్స్‌లో ఉన్నారు. ఈ పర్యటనలో పాకిస్తాన్ తీరును మరోసారి ఆయన ఎండగట్టారు. కాశ్మీర్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణను ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న చర్యలుగా చూడాలని, కేవలం ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యగా చూడొద్దని వెస్ట్రన్ దేశాలకు పిలుపునిచ్చారు.