దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇక నామినేషన్‌కు రెండు రోజులే గడువు ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తమిళనాడు వ్యక్తి, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఇండియా కూటమి వంతు వచ్చింది. ఇందుకోసం ప్రతిపక్ష కూటమి తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక నామినేషన్‌కు ఆగస్టు 21వ తేదీ చివరి రోజు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించేశాయి. తమిళనాడు ప్రాంత వాసి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.