Madhya Pradesh: మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ అనే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 19వ శతాబ్దపు సామాజిక సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్‌ను ‘‘బ్రిటిష్ ఏజెంట్’’గా పిలిచారు. అగర్ మాల్వాలో జరిగిన బిర్సా ముండా జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ సమాజాన్ని కులాల వారీగా విభజించడానికి బ్రిటిష్ వారి తరుపున పనిచేసినట్లు ఆరోపించారు.