Indian Rupee : సామాన్యుడిపై రూపాయి పిడుగు పడబోతోంది. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యుడిని కరెన్సీ మరింత కుంగదీయనుంది. రూపాయి వేగంగా పతనం కావడంతో దేశంలో ధరలు ఎగసి వినియోగదారులపై పెను భారం పడుతుంది. దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సినందున, ముడి చమురు, బంగారం, వంటనూనెలు, పప్పు దినుసుల ధరలు పెరుగుతాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌పై రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారి 80కి చేరువైంది. రూపాయి పతనం రికార్డు…