పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ చేస్తున్న కృషికి మరో జాతీయ గుర్తింపు దక్కింది. అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ తన ‘ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్ 2023: ఇన్ ఫిగర్స్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.