Imran Khan Arrest: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇమ్రాన్ అరెస్టుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.