పంజాబ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రభుత్వానికి గురువారం రూ.1026 కోట్ల జరిమానా విధించింది. పాత వ్యర్థాలు, మురుగునీటి విసర్జన నిర్వహణపై ఖచ్చితమైన చర్యలు తీసుకోనందుకు పంజాబ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఈ జరిమానా విధించింది.