ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు చేసింది. కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపుల వంటి ఫైళ్లని నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని పేషీ సిబ్బందికి సూచించింది.
డీఎస్సీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎస్‌జీటీ పోస్టుల పరీక్షకు బీఈడీ అభ్యర్థులను అనుమతించమని న్యాయస్థానం ముందు ప్రభుత్వం తరపున లాయర్ తమ వాదనను వినిపించారు.
ఏపీలో ప్రైవేట్ పాఠశాలలకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కాలపరిమితి 8 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 3 నుండి 8 ఏళ్ల గుర్తింపు కాలపరిమితి పెంపుదలపై 13 మంది రీజినల్ మరియు జిల్లా అధికారులకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.