Weather Updates : తెలంగాణకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. గత కొన్ని రోజులుగా వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఎండలు ఉక్కపోతతో చికాకుపడుతున్న ప్రజలకు ఇది కొంత ఊరటను కలిగించనుంది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 340 మండలాల్లో వర్షపాతం లోపం నమోదైన నేపథ్యంలో, ఈ వర్ష సూచన కొంత ఉపశమనం కలిగించనుంది. రేపు (గురువారం) నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ…