Heavy Rain: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తుండటంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరింది. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.