బంగ్లాదేశ్ కు తరచూ వెళ్లి వచ్చే ఇలియాస్ అక్కడే ఉండవచ్చని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ తో పాటు పలువురు పాకిస్తానీయులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారుల విచారణలో వెల్లడింది. ఎలాగైనా ఇలియాస్ ను అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడ్ని చేర్చారు.