Hydra: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు నేడు (శుక్రవారం) అక్రమ హోర్డింగులపై దూకుడు పెంచారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు, ప్రత్యేకంగా అక్రమ హోర్డింగులు పెరిగినట్లు గుర్తించడంతో, హైడ్రా అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ మున్సిపాలిటీలో దాదాపు 200 కి పైగా అక్రమ హోర్డింగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం చర్యలు ప్రారంభించారు. ప్రత్యేకంగా హైదరాబాద్-బెంగళూరు…
Bombay High Court: రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే హోర్డింగులపై బాంబే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలపై వారికి ఎలాంటి గౌరవం లేదని వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయం, జస్టిస్ అమిత్ బోర్కర్‌లతో కూడిన ధర్మాసనం మహారాష్ట్ర అంతటా ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగులపై వేసిన పిటిషన్‌ని విచారించింది.