ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఐఐటీ బాబా అభయ్ సింగ్ గురించి చర్చ జరుగుతోంది. మొదట ఐఐటీలో చదివి ఉద్యోగం చేసిన అభయ్ సింగ్ ఇప్పుడు బాబాగా అవతారమెత్తాడు. ఇప్పుడు అభయ్ సింగ్ ఐఐటీ బాబాగా ఇంటర్నెట్‌లో ఫేమస్ అయ్యాడు. ఆయన జీవితంతో పాటు ఆయన పలు వాదనలు కూడా చాలా చర్చనీయాంశమయ్యాయి.