చిన్న సినిమాగా విడుదలైన ’35 చిన్న కథ కాదు’ మంచి సక్సెస్ అందుకుంది. మొదటి రోజు నుంచే పాజిటవ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఓటీటీ వేదిక ‘ఆహా’లో కూడా రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోయింది. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ఈ చిత్రంను ప్రదర్శించనున్నారు. గోవాలోని పనాజీలో నవంబర్ 20 నుంచి…