Idli Kottu: హీరో ధనుష్ ఎప్పుడూ వినూత్నమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టుతో వస్తున్నారు.
Dhanush: ‘కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం…