Volcano erupts again in Iceland: ఐస్‌లాండ్‌లో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. శనివారం బద్దలైన అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగిసిపడ్డాయి. భూమిలోని పగుళ్ల నుండి రాతితో పాటు లావా బయటకు చిమ్మింది. ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్‌జావిక్‌కు దక్షిణంగా ఉన్న రేక్‌జానెస్ ద్వీపకల్పంలో ఈ విస్ఫోటనం సంభవించింది. అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగోసారి. రేక్‌జానెస్‌లో విస్ఫోటనం ప్రారంభమైందని ఐస్‌లాండిక్ వాతావరణ కార్యాలయం తన వెబ్‌సైట్‌లో…