800 earthquakes in 14 hours at Iceland: వరుస భూప్రకంపనలతో ఐస్‌లాండ్ వణికిపోతోంది. సుమారు 14 గంటల వ్యవధిలో 800 ప్రకంపనలు సంభవించాయి. రెక్జానెస్ ప్రాంతంలో శక్తివంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వరుస భూకంపాల కారణంగా గ్రిండవిక్‌లో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుందనే భయంతో ఐస్‌లాండ్ శుక్రవారం అత్యవసర పరిస్థితిని (Iceland Emergency) ప్రకటించింది. గ్రిండవిక్‌లో నివసిస్తున్న వేలాది మందిని ఖాళీ చేయమని స్థానిక అధికారులు ముందుజాగ్రత్తగా ఆదేశాలు జారీ చేశారు. ఐస్‌లాండ్‌లో శుక్రవారం (నవంబర్ 10) సాయంత్రం…