నేటి నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ vs స్కాట్లాండ్ తలపడ్డాయి. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టు దశాబ్దం తర్వాత మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో గెలుచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో స్కాట్‌లాండ్‌ను ఓడించింది. దీంతో.. పదేళ్ల తర్వాత టీమ్ విజయం సాధించడంతో జట్టులోని ఆటగాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గురువారం నుండి ప్రారంభమైంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచినా.. అభిమానుల కళ్లు మాత్రం స్కాటిష్ బౌలర్‌పైనే ఉండిపోయాయి. ఆ బౌలర్ హిజాబ్ ధరించి క్రికెట్ ఆడింది.
ఐసీసీ (ICC) మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా రేపు (అక్టోబర్ 4న) న్యూజిలాండ్‌తో మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగనుంది.