Hyundai Venue: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన కొత్త వెన్యూ(Venue) కోసం బుకింగ్ ప్రారంభించింది. ఆల్ న్యూ వెన్యూ సరికొత్త డిజైన్, స్టైల్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మార్పులతో రాబోతోంది. కొత్త వెన్యూ నవంబర్ 04న అధికారికంగా లాంచ్ కాబోతోంది. దీంతో, కస్టమర్ల కోసం హ్యుందాయ్ బుకింగ్స్ ఓపెన్ చేసింది. కస్టమర్లు హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రూ. 25,000 చెల్లించి కొత్త వెన్యూను రిజర్వ్ చేసుకోవచ్చు.