Hyundai: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) దేశవ్యాప్తంగా తన మొత్తం మోడల్ లైనప్‌పై ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. వాహనాల తయారీలో కీలకమైన విలువైన లోహాలు, ఇతర కమోడిటీల ధరలు పెరగడం వల్ల ఇన్‌పుట్ ఖర్చులు అధికమయ్యాయని కంపెనీ ఈ నిర్ణయానికి కారణంగా పేర్కొంది. మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో HMIL సగటున సుమారు 0.6 శాతం మేర ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. ముడి…