తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట నాగార్జున సాగర్. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, అలాగే ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. అలంటి ప్రాజెక్ట్ కు ఇప్పుడు నీటి కష్టాలు వచ్చాయి. తీవ్ర వర్షం పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ జలాలూ అడుగంటుతున్నాయి. డ్యామ్ లో డెడ్ స్టోరేజ్…